Farmers protest in Janakampeta Rythu Vedik : రైతు వేదికలో నిరసన గళం వినిపించిన రైతులు - RAITULA AANDOLANA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18665323-824-18665323-1685792103006.jpg)
Farmers protest in Telangana Decade Celebrations Nizamabad : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట రైతు వేదికలో రైతులు నిరసన గళం వినిపించారు. తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా అధికారులు రైతు వేదిక ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరైన రైతులు.. జిల్లా అధికారులపై మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో సొసైటీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాకుడా జిల్లాలో సాగునీటి కాలువలను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాలువల్లో పూడికతీత సక్రమంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు. దీని వలన సాగు నీరు దిగువ ప్రాంతాలను అందడం లేదని వాపోయారు. పలు సమస్యలపై ప్రజా ప్రతినిధులు, అధికారులను రైతులు నిలదీశారు. ఒకనొక సమయంలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు రైతులతో మాట్లాడారు. దీంతో పరిస్థితి సద్దుమనిగింది. ఇది ఇలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొత్తం 21రోజులు అన్ని జిల్లాలోనూ దశాబ్ధి వేడుకలు అట్టహాసంగా నిర్వాహించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించింది.