రూపాయి రూపాయి పొదుపు చేసి.. 'జాతీయ స్థాయి'లో మెరిసి.. - జాతీయ స్థాయి ఉత్తమ మండల సమాఖ్య అవార్డు
🎬 Watch Now: Feature Video
National level Mandal Samakhya Award Winners: రూపాయి రూపాయి పొదుపు చేయడం వారి జీవితాలను మార్చేసింది. ఆర్థికంగా బలోపేతం కావడానికి స్వయం ఉపాధి మార్గాలను సృష్టించింది. ఆర్థికంగా బలోపేతమై 2022 -2023 ఏడాదికి జాతీయ స్థాయి ఉత్తమ మండల సమాఖ్య అవార్డు సాధించే స్థాయికి ఎదిగింది. ఈ సందర్భంగా అవార్డు సాధించిన మహిళలు మాట్లాడారు. మండల సమాఖ్యలో గవర్నమెంట్ 88 లక్షలు ఇచ్చందన్నారు. ఇప్పటికీ వారి ఆధాయం 2 కోట్ల 46గా ఉందని తెలిపారు. పొదుపు చేసుకుంటూ ఉన్నందున ఈ ఆధాయం వచ్చిందన్నారు.
భార్యభర్తల సమస్యలను కూడా తమ కమిటీ తీర్చిందని పేర్కొన్నారు. ఈ అవార్డును అందుకోవడం మా అందరికి గర్వంగా ఉందన్నారు. అతి తక్కువ సమయంలో కూడా ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా మంచి మంచి పనులు చేసి దిల్లీలో కూడా అవార్డును తీసుకోవాలనుకుంటున్నమని చెప్పారు. మంచి పనులు చేస్తూ పేరు తెచ్చుకోవాలని కోరుతున్నామన్నారు. రూ.10లతో మొదలు పెట్టి తమ కాళ్లపై తాము నిలబడమే కాకుండా సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.