Excavations at Temple for Hidden Treasures : గుప్తనిధుల కోసం ఆలయంలో క్షుద్రపూజలు, నల్ల కోళ్ల బలి.. విగ్రహాన్ని తొలగిస్తుండగా..! - Siddipet Latest News
🎬 Watch Now: Feature Video
Published : Sep 18, 2023, 2:08 PM IST
Excavations at Temple for Hidden Treasures in Siddipet : కాకతీయుల కాలం నాటి పురాతన రామలింగేశ్వర స్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టి శివలింగాన్ని తొలగించిన ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని సలంద్రిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి సుమారు పదిన్నర గంటల సమయంలో ఎడబోయిన రాజు అనే రైతు తన వ్యవసాయ బావి వద్దకు వెళ్తున్న క్రమంలో రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద పెద్దగా శబ్దాలు వినిపించాయి. తన వద్ద ఉన్న బ్యాటరీ లైట్‌తో ఆలయం వద్ద పరిశీలించాడు. అది గమనించిన దుండగులు గడ్డపారతో పాటు పారను వదిలి అక్కడి నుంచి పారిపోయారు.
రాజు ఇచ్చిన సమాచారం మేరకు గ్రామస్థులు ఆలయం వద్దకు చేరుకొని పరిశీలించారు. ఆలయంలో క్షుద్ర పూజలు నిర్వహించి, రెండు నల్ల కోళ్లను బలిచ్చి ఆలయంలోని శివలింగాన్ని తొలగించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.