Pratidwani : మూసీ ప్రక్షాళన ఎలా? ఎప్పుడు? - ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
Pratidwani : మూసీలో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డ్రగ్, బల్క్ పరిశ్రమల వ్యర్థాల ఘాటు వాసనలు వారికి ఊపిరిసలపనివ్వడం లేదు. మూసీ మురికి వదిలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంతగా ప్రయత్నం చేస్తున్నా... ఎన్ని అభివృద్ధి ప్రణాళికలు తీసుకుని వస్తున్నా.. అటువైపు వెళ్తేనే ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. ఇక ఆ పరివాహక ప్రాంతాల్లో కంటిమీద కునుకులేకుండా చేస్తున్న దోమలదండయాత్ర సరేసరి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూసీకి మంచిరోజులు వస్తాయని అంతా భావించారు. ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధతో ఈ నదికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే అధికారుల చిత్తశుద్ధి లోపం, స్థానిక నాయకుల ఒత్తిళ్ల మధ్య ఆ నది ప్రక్షాళన అటకెక్కింది. అప్పుడప్పుడు తూతూమంత్రంగా తీసుకునే చర్యలతో ఎలాంటి ప్రయోజనం లేదని పాలకులు ఇప్పటికే గ్రహించి ఉంటారు. అసలు మూసీకి ఎందుకీ పరిస్థితి? మూసీ ప్రక్షాళన, పునర్వైభవం దిశగా ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాల్లో పురోగతి ఎలా ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.