Pratidwani : తెలంగాణలో ప్రధాన పార్టీల ప్రచారాస్త్రాలు ఎలా ఉండబోతున్నాయి?
🎬 Watch Now: Feature Video
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ అలా రావడమే ఆలస్యం... ఎలక్షన్ సందడి మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి రేసులో ముందున్న అధికార పార్టీ బీఆర్ఎస్ చకాచకా ఎన్నికల ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. ఈనెల 15న మేనిఫెస్టో విడుదలతో పాటు గులాబీ బాస్ కేసీఆర్ 41 నియోజకవర్గాల్లో సుడిగాలి ప్రచారం చేసేందుకు కూడా షెడ్యూల్ రెడీ చేసుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల కసరత్తుపై ఇంకా కుస్తీలు పడుతోంది. వచ్చే వారం రోజుల్లో తొలి జాబితా వచ్చే అవకాశం ఉందని హస్తం నేతలు చెబుతున్నారు. ఇప్పటికే 6 గ్యారెంటీ పథకాలు ప్రకటించిన కాంగ్రెస్ నేతలు.. వాటి ప్రచారంపై దృష్టి సారించారు. మరోవైపు బీజేపీ ఈనెల 15న తొలి జాబితా విడుదల చేస్తామని చెబుతోంది. నిన్న ఆదిలాబాద్లో అమిత్ షాతో ఎన్నికల ప్రచార భేరీ మోగించిన కమలం నేతలు.. ఇక ప్రచారాన్ని ఉధృతం చేసే పనిలో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారాస్త్రాలు ఎలా ఉండబోతున్నాయి?.. ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎత్తుగడలు ఏంటి?.. ఈ అంశాలపై ఇవాళ్టి ప్రతిధ్వని..