Mountaineer Vivek Kumar Interview : మారుమూల గిరిజన గ్రామంలో పుట్టాడు.. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు.. - tribal man Vivek Kumar climbed Mount Kilimanjaro
🎬 Watch Now: Feature Video
Published : Sep 13, 2023, 3:54 PM IST
Telangana Youngman Vivek Kumar Climbing Mountains : సాఫ్ట్వేర్ కొలువు సాధించిన.. తాను పెరిగిన పరిస్థితులు తనను పర్వతారోహణ వైపు నడిపించాయి. ఏడు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతో.. అటుగా అడుగులు వేశాడు. చివరికి తాను అనుకున్నది నెరవేర్చుకుంటూ.. విజయపథంలో నడుస్తున్నాడు. ఆ యువకుడు ఎవరో కాదు.. తెలంగాణ బిడ్డ వివేక్ కుమార్. గిరిజన ప్రాంతంలో పుట్టిన ఆ యువకుడు గతంలో మౌంట్ ఎల్బ్రస్ శిఖరాగ్రాన్ని చేరుకున్నాడు.
అలాగే ఇటీవల ఎంతో మంది పర్వతారోహకులకు ఇష్టమైన కిలిమంజారో శిఖరాగ్రాన్ని సైతం అధిరోహించి.. పలువురి ప్రశంసలు అందుకున్నాడు. మరి త్వరలో దాతల సహకారంతో ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేస్తానని వివేక్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిన్ననాటి నుంచే పర్వతారోహణపై ఆసక్తి.. అందుకు తగిన కఠిన శిక్షణ, అప్రమత్తత ఎంతో అవసరమని తెలుపుతున్నారు. మొక్కవోని ధైర్యమే తనను ఆ పర్వతారోహణ చేసేందుకు ఇంధనమని తెలిపారు. అసలు పర్వతారోహణ అంటే ఆసక్తి ఎలా కలిగింది...? మౌంటెనీరింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి లాంటి విషయాలను అతన్నే అడిగి తెలుసుకుందాం.