Etala Rajendar At Khammam BJP Meeting : 'ఎంతటి వారైనా కేసీఆర్ గడి దగ్గర జీతగాళ్లగానే ఉండాలి' - ఖమ్మంలో బీజేపీ మీటింగ్
🎬 Watch Now: Feature Video
Published : Sep 10, 2023, 11:44 AM IST
Etala Rajendar At Khammam BJP Meeting : ఎంతటి వారైనా కేసీఆర్ గడి వద్ద జీతగాళ్లగానే ఉండాలని హుజూర్‌బాద్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేసిన బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. వైరా నియోజవకర్గం ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌కు సీఎం కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. టిక్కెట్ రాకుండా చేస్తే జిల్లా మంత్రి పువ్వాడ అతడికి మూడు నెలల ముందగానే ప్రభుత్వ పథకాలు రాకుండా అవమాన పరుస్తున్నారన్నారు. మళ్లీ ఎన్నికలై కొత్త ఎమ్మెల్యే వచ్చే వరకు రాములునాయకే ఉంటారని, ప్రస్తుతం అతడిని గడ్డిపూసలాగా తీసేస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ కూడా తనను ప్రగతిభవన్ వద్దకు కూడా రానివ్వడం లేదని ఆవేదన చెందిన రోజులున్నాయని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలో ప్రజలు చైతన్యవంతులని రానున్న రోజుల్లో మోసపూరిత కేసీఆర్‌కు సరైన సమాధానం చెబుతారని అన్నారు. పోడు, సాగు చేసుకునే గిరిజన బిడ్డలను అనేక విధాలుగా కష్టపెట్టారని, గిట్టుబాటు అడిగిన రైతుకు సంకెళ్లు వేశారని ఇలాంటి పాలనకు చరమగీతం పాడే విధంగా బీజేపీ శ్రేణులు కష్టపడాలన్నారు. సమావేశానికి ముందు వైరా రింగ్‌రోడ్ వద్ద ఈటలతోపాటు అతిథులకు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ద్విచక్రవాహనాలు, కార్ల ర్యాలీతో అయ్యప్ప ఆలయం వద్ద సమావేశ మందిరం వరకు వెళ్లారు.