ఐనవోలు మల్లన్న స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ఎర్రబెల్లి పూజలు - నామినేషన్ పత్రాలకు పూజలు చేసిన మంత్రి ఎర్రబెల్లి
🎬 Watch Now: Feature Video
Published : Nov 6, 2023, 7:04 PM IST
Minister Errabelli Visits Inavolu temple : తెలంగాణలో శాసనసభ ఎన్నికల నామినేషన్ల పరంపర కొనసాగుతోంది. ఇవాళ మంచిరోజు కావడంతో కొందరు నాయకులు నామినేషన్లు దాఖలు చేస్తుంటే.. మరికొందరు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయంలో తన నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేయించారు. హనుమకొండ జిల్లాలో గల ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఇలా నామినేషన్ పత్రాలను దేవుని పాాదాల చెంత నుంచి ఆశీర్వాదం పొందటం ఆనవాయితీగా చెప్పుకొచ్చారు. కొబ్బరికాయ కొట్టి, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత ఆరు పర్యాయాలుగా మంత్రి ఎర్రబెల్లి ఐనవోలు దేవాలయంలో నామినేషన్ పత్రాలతో పూజలు నిర్వహించడం అనవాయితీగా వస్తుందన్నారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకొని ప్రతి ఎలక్షన్లో తాను విజయకేతనం ఎగరవేశానని.. ఈసారి కూడా పాలకుర్తి నుంచి భారీ మెజారిటీతో గెలుస్తానని మంత్రి ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 10న ఎర్రబెల్లి నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు.