నిజామాబాద్ జిల్లాలో సీఎం కాన్వాయ్​ను తనిఖీ చేసిన ఎన్నికల బృందం - సబితా కాన్వాయ్​ను తనిఖీ చేసిన పోలీసులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2023, 8:14 PM IST

Election Team Inspects CM KCR Convoy in Nizamabad : రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్​ వెలువడిన నాటి నుంచి పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. నగదు, మద్యం, కానుకల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు. నేతల నుంచి మంత్రుల వరకు అందరి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. తాజాగా ఇవాళ నిజామాబాద్‌ జిల్లాలో సీఎం కాన్వాయ్​ను ఎన్నికల బృందం తనిఖీ చేసింది. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి టోల్‌ ప్లాజా వద్ద సీఎం కాన్వాయ్​ను స్టాటిస్టికల్‌ సర్వైలెన్స్‌ బృందం తనిఖీలు చేసింది. హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ మీదుగా వెళ్తున్న కాన్వాయ్​ను ఇందల్వాయి టోల్‌ ప్లాజ్‌ వద్ద కేంద్ర బలగాలతో కూడిన బృందం తనిఖీలు చేసింది.

Police Inspects Minister Sabitha Convoy : మరోవైపు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ బీఆర్​ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించి వెళ్తుండగా బాలాపూర్‌ శివాజీ చౌక్ వద్ద మంత్రి కాన్వాయ్‌ వాహన శ్రేణిని పోలీసులు నిలిపివేశారు. కాన్వాయ్​లోని అన్ని వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి సోదా చేశారు. వాహనం దిగిన మంత్రి సబిత.. పోలీసులకు సహకరించారు. పోలీసులు మంత్రి పర్సును కూడా తనిఖీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.