Do Heart Stents Need To Be Replaced : గుండెలోని స్టంట్​లు మార్చడం సేఫేనా?.. వైద్యులు ఏమంటున్నారు? - తరచుగా హార్ట్​ స్టెంట్లు మార్చాలా పూర్తి వివరాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 6:44 PM IST

Do Heart Stents Need To Be Replaced : గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో వేసే స్టెంట్​​లు తరచూ మార్చడం అనేది మనిషి జీవనశైలితో పాటు అతడి ఆహారపు అలువాట్లపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు వైద్యులు. సాధారణంగా హార్ట్​ పేషెంట్లలో వేసే స్టెంట్​​లు (Is It Safe To Replace Heart Stent) అతడి శరీరం లోపల అడ్జెస్ట్​ అవ్వడానికి కనీసం 6 నుంచి 9 నెలలు పడుతుంది. అయితే ఇలా వేసిన స్టెంట్​​లు బ్లాక్​ అయ్యే అవకాశాలున్నప్పటికీ అవి చాలా అరుదైన సందర్భాల్లోనే జరుగుతాయంటున్నారు డా.చాణక్య కిషోర్​. 

శరీరంలో వేసిన స్టెంట్​​లు శరీర పరిస్థితులకు అలవాటు పడ్డాక సరైన డైట్​ ప్లాన్​ ఫాలో అవుతూ రోజూ వ్యాయామం, యోగా లాంటి వాటిని అనుకరిస్తే సుమారు 8 నుంచి 10 ఏళ్ల వరకు ఎటువంటి సమస్యలు రావని సూచిస్తున్నారు డాక్టర్లు. అదే స్టెంట్​​లు వేసిన తర్వాత కూడా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించి పొగ తాగడం, మధుమేహం విషయాల్లో జాగ్రత్తలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే గనుక కేవలం 3, 4 ఏళ్లల్లోనే వేసిన స్టెంట్​​లు బ్లాక్​ అయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు కార్డియాలజిస్ట్​ డా.చాణక్య కిషోర్​. ఇలాంటి సందర్భాల్లో మళ్లీ మళ్లీ స్టెంట్​​లు మార్చాల్సి వస్తుందని అంటున్నారు. మరి ఇలా రక్తనాళాల్లో తరచూ స్టెంట్​​లు మార్చడం సురక్షితమేనా? లేదా అనే దానికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియో చూసి తెలుసుకుందాం. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.