Pratidwani on Fake Seeds : నకిలీ విత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయ్..?
🎬 Watch Now: Feature Video
Debate on Fake Seeds : వానాకాలం సాగుకు విత్తనాల అందుబాటు ఎలా? విత్తన నియంత్రణ, నకిలీ విత్తనాల కట్టడికి ఏం చేయాలి? వ్యవసాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలివి. జూన్ 1 నుంచి వర్షాకాలం ప్రారంభం కానుంది. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నత అధికారులతో సమీక్షించారు. సాధారణంగా ఏటా వర్షాకాలం ముందుగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఇలాంటి సమీక్షా సమావేశాలు జరగడం.. పగడ్బందీ, కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలు రావడం జరిగేదే. కానీ తర్వాత ఏం అవుతోంది? దేశంలో అవసరమైన 60 శాతం విత్తనాలను తెలంగాణనే అందిస్తున్నది. అంత ఘనత ఉండి కూడా ఏటా పంటల సీజన్‌లో నకిలీ విత్తనాల ముప్పు ఎందుకు? దేశానికే ఆదర్శంగా తెలంగాణ వ్యవసాయ రంగం అని ప్రభుత్వం చెబుతున్న మాటకు సార్థకత చేకూరాలంటే ఈ విషయాల్లో ఏం సమీక్షించుకోవాలి? ఇంకా ఎలాంటి చర్యలు అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.