పూరీ గుడికి ఎలుకలను తీసుకొచ్చిన భక్తురాలు- మూషికాల ప్రవర్తనకు భక్తులు షాక్! - పూరి ఆలయంలో కోల్కతా భక్తురాలు
🎬 Watch Now: Feature Video


Published : Dec 14, 2023, 9:19 PM IST
Devotee Bring Rats To Puri temple Viral Video : ఒడిశాలోని ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ్ దేవాలయానికి ఎలుకలతో వచ్చారు ఓ భక్తురాలు. అయితే ఆలయ సింహద్వారం వద్ద ఆమె తెచ్చిన రెండు ఎలుకల ప్రవర్తనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
బంగాల్లోని కోల్కతాకు చెందిన ఓ భక్తురాలు ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయ దర్శనానికి వచ్చారు. ఆ సమయంలో తాను పెంచుకుంటున్న రెండు మూషికాలను తన వెంట తెచ్చారు. వాటికి స్వెట్టర్లు వేసి మరీ ఆమె తీసుకువచ్చారు. అయితే ఆలయ సింహద్వారం వద్ద ఆమె జై జగన్నాథ్ అని అనగానే ఎలుకలు చిన్నగా శబ్దం చేసినట్లుగా వీడియోలో తెలుస్తోంది. దీంతో ఎలుకల ప్రవర్తనకు అక్కడ ఉన్న భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారని సమాచారం. దీనిని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది.