గుడిలో భక్తుడి వింత ప్రవర్తన- వానరంలా టెంకాయలను నోటితో చీల్చి, నీటిని ఒంటిపై పోసుకొని! - వానరంలా మారి 10 టెంకాయలను చీల్చిన భక్తుడు
🎬 Watch Now: Feature Video
Published : Nov 18, 2023, 4:39 PM IST
Devotee Behave Like Hanuman : తమిళనాడు తిరుప్పూర్ జిల్లాలో ఓ భక్తుడు విచిత్రంగా ప్రవర్తించాడు. పొంగలూరు పంచాయతీ పరిధిలో అళగుమలై మురుగన్ ఆలయంలో ఓ వ్యక్తి వానరంలా ప్రవర్తించాడు. హనుమంతుడి ఉపాలయంలో విగ్రహంతో మాట్లాడుతూ కొబ్బరికాయలను చీల్చి, నీటిని ఒంటిపై పోసుకున్నాడు.
ప్రస్తుతం ఈ ఆలయంలో కంద షష్ఠి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వేడుకల్లో నాల్గో రోజైన శుక్రవారం ఈ ఆలయానికి ఉత్తరభారతానికి చెందిన ఓ భక్తుడు దర్శనం కోసం వచ్చాడు. ఈ సందర్భంగా అతడు ఉన్నట్టుండి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆలయంలోని హనుమంతుడి విగ్రహం ముందు అతడు వానరంలా అరుస్తూ కనిపించాడు. అంతేకాకుండా పూజ కోసం భక్తులు తీసుకువచ్చిన 10కిపైగా టెంకాయలను తన పళ్లతో ఒలిచి ఆ కొబ్బరి నీళ్లను తనపై పోసుకున్నాడు. కొన్ని టెంకాయల నీటిని తాగాడు. ఇక కొద్దిసేపటి తర్వాత ఆ యువకుడు సాధారణ స్థితికు చేరుకున్నాడు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న మిగతా భక్తులు ఆశ్చర్యంగా చూశారు. వాటిని తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.