Devi Sharan Navaratri Celebrations 2023 : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు.. - Hyderabad Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2023, 10:19 PM IST

Devi Sharan Navaratri Celebrations 2023 in Telangana : రాష్ట్రవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి (Devi Sharan Navaratri) మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు, మహిళల కుంకుమార్చనలతో కన్నుల పండువగా సాగుతున్నాయి. అక్టోబరు 13 నుంచి 23 వరకు జరగనున్న ఉత్సవాల్లో అమ్మవారు పలు అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి తొలి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో పోటెత్తారు.

Navratri celebrations in Telangana : భద్రాద్రిలో శ్రీలక్ష్మీ తాయారు అమ్మవారిని ఆదిలక్ష్మీ రూపంలో అలంకరించారు. సిద్దిపేట జిల్లా వర్గల్‌ విద్యాదరి క్షేత్రంలో అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. మెదక్‌ జిల్లా నాగసాన్‌పల్లిలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో అమ్మవారికి అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. జగిత్యాలలో దేవీ శోభాయాత్రలో భాగంగా కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. పోతురాజుల విన్యాసాలు, చిన్నారుల వేషధారణ, ఒగ్గు డోలా కళాకారుల ప్రదర్శన అకట్టుకున్నాయి. మానకొండూరు నియోజకవర్గంలోని ఖాసీంపేట మానసాదేవి ఆలయంలో 4.5 అడుగుల శ్రీచక్రం ప్రతిష్ఠాపన వైభవంగా జరిగింది. యువతులు, మహిళల కోలాటాల విన్యాసాలు ఆకర్షించాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.