రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్​కు వ్యవస్థ ప్రక్షాళన ఎలా? - పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2023, 9:19 PM IST

Debate on Police System in Telangana : కొన్ని రోజులుగా తెలంగాణ పోలీస్‌ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. రోజుల వ్యవధిలో పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న క్రమశిక్షణ చర్యలు, చీటింగ్‌కేసులో ఏకంగా ఒక ఐపీఎస్‌ అధికారే అరెస్టు కావడం సంచలనమైంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ వ్యవస్థ ప్రక్షాళనపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్లు చర్చ జరుగుతోంది. మరి ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడానికి అసలు కారణాలేంటి? రాబోయే ఆ మార్పు ఎలా ఉండాలి?

తెలంగాణ పోలీస్ వ్యవస్థ ప్రక్షాళనపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? సమాజంలోని నేరప్రవృత్తి కల వ్యక్తుల కదలికలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచుతారు. అదే పోలీస్‌ శాఖలోని నేరప్రవృత్తిగల అధికారులను ఎవరు గుర్తిస్తారు? పోలీసు వృత్తిలో కాఠిన్యంతో పాటు మానవత్వం మేళవిం చినప్పుడే ప్రజలకు జరగాల్సిన మేలు చేకూరుతుందన్నది చాలామంది సూచన. ఈ విషయంలో రాష్ట్రం ఎక్కడుంది? ఇంకా ఏం చేస్తే మేలు అని మీ సూచన? ఫ్రెండ్లీ, పారదర్శక, నిష్పాక్షిక పోలీసింగ్‌ దిశగా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.