Rana at Hyderabad Public School : 'ఏ వాతావరణంలోనైనా పని చేయడానికి కావాల్సిన శక్తిని పాఠశాల నేర్పింది' - దగ్గుబాటి రానా స్కూల్ జీవితం
🎬 Watch Now: Feature Video
Rana at Hyderabad Public School : ఒక నటుడిగా తాను ఏ వాతావరణంలోనైనా పని చేయడానికి కావాల్సిన శక్తిని పాఠశాల వాతావరణం నేర్పించిందని ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా గుర్తు చేసుకున్నారు. పాఠశాల అనేది చదవు ఒక్కటే కాకుండా.. మన సంస్కృతిని, సంప్రదాయాలను నేర్పిస్తుందని అన్నారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానా హాజరయ్యారు. ఈ సందర్బంగా పిల్లలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమాల్లో భాగంగా స్కూల్ విద్యార్థులు ఆటపాటలతో అలరించారు.
సంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన రానా.. విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. చిన్నారుల ఆటపాటలను తనను ఎంతో ఆకర్షించాయని సంతోషం వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు తాను కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నట్లు గుర్తు చేసుకున్న రానా.. ఈ పాఠశాల తనకెన్నో జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు. ఆ సందర్భంగా ఆయన పదో తరగతి పరీక్షలో ఫెయిల్ అయిన సంగతి గుర్తు చేసుకొని నవ్వులు పూయించారు. చదువుల్లో ఫెయిల్ అయినా.. జీవితంలో ఎదగడానికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తనకెంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు. ఇదే పాఠశాల నుంచి ఎంతో మంది దర్శకులు, వ్యాపార వేత్తలు, శాస్త్రవేత్తలుగా ఎదిగారని గుర్తు చేశారు. ప్రస్తుత విద్యార్థులు కూడా మంచి స్థాయిలో స్థిరపడాలని రానా ఆకాంక్షించారు.