ఇంటి వద్ద 8కిలోల మొసలి పిల్ల కలకలం- స్థానికులు హడల్! - జనావాసాలకు దగ్గరగా వచ్చిన 4 అడుగుల మొసలి
🎬 Watch Now: Feature Video
Published : Dec 7, 2023, 4:37 PM IST
|Updated : Dec 7, 2023, 4:43 PM IST
Crocodile Found in Residential Area Viral Video : కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఎనిమిది కిలోల బరువు ఉన్న ఓ మొసలి పిల్ల కలకలం రేపింది. నాలుగు అడుగుల పొడవు ఉన్న ఆ మొసలి పిల్లను చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
జిల్లాలోని గంగావతి నగరం జయనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి సమీపంలో ఇసుక దిబ్బ వద్ద మొసలి పిల్ల కనిపించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొసలి పిల్ల బరువు 8 కిలోలు, నాలుగు అడుగుల పొడవు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.
వెంటనే స్థానికంగా జంతువులు పట్టే వ్యక్తి అయిన సిరిగేరి రాఘవేందర్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అతడు అక్కడకు చేరుకున్నాడు. మొసలిని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించాడు. అనంతరం అధికారులు తుంగభద్ర నదిలో మొసలిని సురక్షితంగా విడిచిపెట్టారు. మొసలి సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని అధికారులు తెలిపారు. నివాస ప్రాంతం చుట్టూ నీటి వనరులు లేకపోయినా మొసలి కనిపించడం ఆశ్యర్యంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.