వరి పొలంలో 9 అడుగుల మొసలి.. చెట్టుపై ఎలుగుబంటి - Karnataka crocodile in crop land latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 24, 2023, 4:21 PM IST

కర్ణాటకలోని విజయనగర జిల్లాలో మొసలి హల్​చల్​ చేసింది. జిల్లాలోని హువినా హడగలి నగరంలోని తుంగభద్ర నదిలో నుంచి బయటకు వచ్చిన 9 అడుగల భారీ మొసలి రాజావాలా గ్రామంలోని ఓ వరి పొలంలోకి ప్రవేశించింది. ఇంత పొడవున్న మొసలిని చూసి గ్రామస్థులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. గ్రామస్థులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందిచారు. అటవీ శాఖ సిబ్బంది రైతలు సాయంతో మొసలిని తాడుతో బంధించి వాహనంలోకి ఎక్కించారు. అనంతరం దాన్ని సురక్షితంగా అడవిలోకి విడిచిపెట్టారు. 

మరోవైపు వెంకటాపురా గ్రామ శివారులో ఓ ఎలుగుబంటి చెట్టుపైకి ఎక్కి బీభత్సం సృష్టించింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ​ అధికారి వినయ్​ సిబ్బందితో కలిసి రెస్క్యూ ఆపరేషన్​ నిర్వహించారు. చాకచక్యంగా దాన్ని పట్టుకొని అడవిలో వదిలిపెట్టారు. కాగా, ఎలుగుబంటి ఎక్కిన చెట్టుకు తేనె పట్టు ఉండటం వల్ల అది పైకి ఎక్కిందని గ్రామస్థులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.