Cricketer Mithali raj inaugurated Tournament : క్రీడోత్సవాలను ప్రారంభించిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ - mithali raj latest news
🎬 Watch Now: Feature Video
Cricketer Mithali raj inaugurated Tournament : మేడ్చల్ జిల్లాలోని వెంకటాపురం డివిజన్లో ఏర్పాటు చేసిన టీం సాయి క్రీడోత్సవాలను ఇండియన్ మహిళ మాజీ కెప్టెన్ పద్మశ్రీ మిథాలీ రాజ్ ప్రారంభించారు. యువతలో క్రీడాశక్తిని నింపి వారి ప్రతిభను వెలికి తీసేందుకు టీం సాయి చేస్తున్న కృషి అభినందనీయమని ఇలాంటి క్రీడలు మరిన్ని నిర్వహించాలని కోరారు. ఎంతోమంది క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు ఇలాంటి క్రీడా ఉత్సవాలు ఉపయోగపడతాయని వివిధ రకాల క్రీడలను భాగస్వామ్యం చేస్తూ ఇలాంటి టోర్నీలు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. యువత పెడదారి పట్టకుండా వారిలో మానసిక శారీరక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు టీం సాయి స్పోర్ట్స్ ఉత్సవ్ పేరిట క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీం సాయి సంస్థ అధినేత సాయి ప్రసాద్ తెలిపారు. యువతలో చైతన్యం తీసుకువచ్చేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు వారాల పాటు ఈ క్రీడా ఉత్సవాలు నిర్వహించి వందలాది మంది యువతను క్రీడల్లో భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు.