క్రికెట్ ఆడుతుండగా పక్కింట్లో పడిన బాల్.. విద్యార్థులను చితకబాదిన యువకులు - Cricket caused Clash in Hyderabad

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 30, 2023, 10:41 AM IST

Cricket caused Clash Between Youngsters in Hyderabad : హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ నూరినగర్​లో క్రికెట్ ఆడుతుండగా వివాదం చెలరేగింది. అది కాస్త తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ గొడవలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. నూరినగర్​లో ఓ ఇంటి డాబాపైకొందరు ఇంటర్ విద్యార్థులు క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలో బంతి గోడ దాటి పక్కింట్లో పడింది. 

క్రికెట్ బాల్ పడిన ఇంట్లో ఉన్న యువకులు విద్యార్థులతో గొడవకు దిగారు. చిన్న వాగ్వాదంతో మొదలైన గొడవ తీవ్ర ఘర్షణకు దారితీసింది. అక్కడే కాసేపు ఘర్షణ పడిన యువకులు.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ అంతటితో వదలకుండా అర్ధరాత్రి సమయంలో బంతి పడేసిన విద్యార్థుల ఇంటిపై రాళ్లు రువ్వారు. అడ్డొచ్చిన వారిపై దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబసభ్యులు క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.