కేసీఆర్‌తో సీఎం జగన్ భేటీ రాజకీయంలో భాగమే : నారాయణ - సీపీఐ నారాయణ
🎬 Watch Now: Feature Video
Published : Jan 4, 2024, 3:47 PM IST
CPI Narayana Comments on CM Jagan meet KCR : కేసీఆర్‌తో సీఎం జగన్ భేటీ రాజకీయంలో భాగమేనని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ పోలింగ్ రోజే నాగార్జున సాగర్ వివాదం తెరపైకి తెచ్చి రెండు రాష్ట్రాల మధ్య గొడవ సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సెంటిమెంట్ రెచ్చ గొట్టి కేసీఅర్ను మళ్లీ గెలిపించాలని జగన్ చూశారని నారాయణ ఆరోపించారు. ఇప్పుడు తనను గెలిపించేందుకు ఏదైనా చేయమని కోరేందుకు జగన్ కేసీఆర్ను కలిశారని విమర్శించారు.
సీఎం జగన్కు ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. ఎన్నికలకు ముందు తెలంగాణలో కేసీఆర్కు ప్రజావ్యతిరేక గాలి వీచినట్లు, ప్రస్తుతం జగన్కు ఏపీలో తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. వైయస్ షర్మిలకు కాంగ్రెస్ అధ్యక్ష పదవి దేవుడెరుగు కానీ జగన్కు మాత్రం మొదటిసారిగా భయం పట్టుకుందన్నారు. తన కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా అందరూ దూరమయ్యారన్నారు. ప్రతిపక్షాలు తన కొంపలో చిచ్చు పెట్టాయని జగన్ విమర్శిస్తున్నారని అందులో వాస్తవం లేదని జగనే తన కొంపలో చిచ్చు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే విధంగా బీజేపీ కుట్ర పన్నుతోందని నారాయణ ఆరోపించారు.