మంత్రివర్గంలోకి ఆహ్వానిస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం : కూనంనేని సాంబశివరావు - సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని తాజా ఇంటర్వ్యూ
🎬 Watch Now: Feature Video


Published : Dec 5, 2023, 3:13 PM IST
CPI MLA Kunamneni Sambasiva Rao Interview : రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి సీపీఐ నుంచి సాంబశివరావు విజయం సాధించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళం వినిపిస్తానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కార్మికుల హక్కుల కోసం, ఇళ్లు లేని నిరుపేదల పక్షాన పోరాడతానని, అవినీతికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి గొంతు వినిపిస్తానని కూనంనేని అన్నారు. ప్రగతిశీల, వామపక్ష మేధావులు సీపీఐ గెలవాలని కోరుకున్నారని ఆయన తెలిపారు. చాపుకు, పెళ్లికి ఓకే మంత్రం ఉండదని, మిత్రపక్షంగా ఉన్నప్పుడు నిర్మాణపరమైన సలహాలు, సూచనలు ఇస్తూ తమ పాత్ర పోషిస్తామని కూనంనేని చెప్పారు.
MLA Kunamneni Sambasiva Rao of Kothagudem : నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో సీఎం అభ్యర్థిగా అధిష్టానం ఎంపికపై తాము ఏకాభిప్రాయం తెలిపామని సాంబశివరావు వెల్లడించారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇస్తామన్నారు. మంత్రివర్గంలోకి ఆహ్వానిస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటున్న కూనంనేని సాంబశివరావుతో ఈటీవీ ముఖాముఖి.