CPI Leader Narayana Spoke to Lokesh on Phone: చంద్రబాబు అరెస్ట్​ను ఖండించిన సీపీఐ నారాయణ.. లోకేశ్​కు ఫోన్ - చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో సంబరాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 4:00 PM IST

CPI Leader Narayana who Spoke to Lokesh on Phone:  తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్​ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. అయితే, చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ పలు పార్టీలు ఇప్పటికే ఖండించాయి. కేవలం కక్షపురితంగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబును ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించాయి. చంద్రబాబు అరెస్ట్​కు నిరసనగా టీడీపీ రాష్ట్రవ్యాప్తం బంద్​​కు పిలుపునివ్వగా... పలుపార్టీలు సైతం టీడీపీ బంద్ పలుపుకు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా చంద్రబాబును అరెస్ట్​పై సీపీఐ నేత నారాయణ స్పందించారు. 

లోకేశ్​కి ఫోన్ చేసిన నారాయణ:  చంద్రబాబు(Chandrababu) అక్రమ అరెస్ట్​ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI national secretary Narayana) తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు తెలుగుదేశం  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కి ఫోన్ చేసి పరామర్శించారు. బంద్​కి సంపూర్ణ మద్దతు తెలిపామని లోకేశ్​కు తెలిపారు. నియంత పాలనపై అందరూ కలిసి పోరాడదామని లోకేశ్​తో అన్నారు. బంద్​కి మద్దతు ఇచ్చినందుకు నారాయణకు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.