'సింగరేణి ఎన్నికలకు రాజకీయాల సంబంధాలకు ఎలాంటి సంబంధం లేదు' - narayana latest comments
🎬 Watch Now: Feature Video
Published : Dec 29, 2023, 4:52 PM IST
CPI Leader Narayana Congress And CPI Differences in Telangana : సింగరేణి ఎన్నికల తరువాత రాజకీయంగా కాంగ్రెస్, సీపీఐ మధ్య తగవు వచ్చిందన్న ప్రచారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి స్పందించారు. సింగరేణి ఎన్నికలకు రాజకీయాలను ఎలాంటి సంబంధం లేదని, తగవు గురించి చేస్తున్న ప్రచారాలు అవాస్తవమన్నారు. కార్మికుల ఎన్నికలు 1945 నుంచి జరుగతున్నాయని వాటిలో అనేక సంఘాలు పాల్గొంటున్నాయని, దానిలో రాజకీయాలకు ఎలాంటి తావు లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల సమయాల్లో దుష్ట సంప్రదాయానికి తెరలేపిందన్నారు.
ఎన్నికల్లో పాల్గొని ప్రలోభాలతో కార్మికులను చెడగొట్టారని దుయ్యబట్టారు. అలాంటివి ఎప్పుడు కొనసాగకూడదని ఉద్దేశం వారిదన్నారు. సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘాన్ని ఓడించామన్నారు. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఎప్పుడైన అధికార ప్రభుత్వం కార్మిక సంఘాలను ప్రలోభాలకు గురి చేయకూడదన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా చాలా విధాలుగా ప్రచారాలు జరుగుతాయని ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు సాగాలని నారాయణ సూచించారు.