వృద్ధురాలిపై ఆవు దాడి.. కొమ్ములతో పొడిచి.. కాళ్లతో తన్ని.. - గుజరాత్లో వృద్ధురాలిపై ఆవు దాడి
🎬 Watch Now: Feature Video

గుజరాత్లో వృద్ధురాలిపై దాడి చేసింది ఓ ఆవు. కొమ్ములతో పొడుస్తూ.. కాళ్లతో తన్నింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. అప్పుడే దూడకు జన్మనిచ్చిన ఆవు .. ఇలా వృద్ధురాలిపై దాడి చేసింది. వడోదర కార్పోరేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వృద్ధురాలు పని మీద బయటకు వెళ్లి.. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆమెపై గోవు దాడి చేసింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిందీ విషాదం. ఆవును అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నం చేసినప్పటికి లాభం లేకుండా పోయింది. వారిపైనా ఆవు దాడి చేసేందుకు ప్రయత్నించింది. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించేందుకు స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. వృద్ధురాలిని పరీక్షించిన అంబులెన్స్ సిబ్బంది అప్పటికే ఆమె మృతి చెందిదని తెలిపారు. "సడెన్‌గా ఓ మహిళ గట్టిగా అరవడం నాకు వినిపించింది. ఇంట్లో ఉన్న నేను బయటకు వచ్చి చూశాను. ఓ వృద్ధ మహిళ కాపాడమంటూ అరుస్తోంది. అప్పుడే దూడకు జన్మనిచ్చిన ఆవు.. వృద్ధురాలిపై దాడి చేసింది" అని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.