ఫోర్త్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్‌లో పడిపోయి డెలివరీ బాయ్ మృతి - COURIER BOY DEAD
🎬 Watch Now: Feature Video
Published : Dec 9, 2023, 2:57 PM IST
Courier Boy Died After Falling From the Lift : హైదరాబాద్ అశోక్ నగర్‌లోని నివాస్ టవర్స్‌లో ఫోర్త్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్‌లో పడిపోయి డెలివరీ బాయ్ మృతి చెందాడు. ఫోన్ మాట్లాడుతూ నాలుగో అంతస్తులో లిఫ్ట్ డోర్ తెరవగా లిఫ్ట్ వచ్చిందని అందులో కాలు పెట్టాడు. అయితే అప్పటికి లిఫ్ట్ పైకి రాకపోవటంతో కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మయూరి నగర్‌కు చెందిన జేమ్స్ (38) ఓ ప్రైవేట్ కొరియర్ సంస్థలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. గురువారం అశోక్ నగర్‌లోని నివాస్ టవర్స్ అనే అపార్టుమెంట్ నాలుగో అంతస్తులో ఇచ్చిన పార్సిల్‌ను రిటర్న్ తీసుకోవడానికి వెళ్లాడు.
తిరిగి కిందకు వెళ్లేందుకు నాలుగో అంతస్తులోని లిఫ్ట్ డోర్ తెరిచాడు. లిఫ్ట్ పైకి రాక కిందే ఉండిపోయింది. ఫోన్ మాట్లాడుతూ ఇది గమనించని ఆయన లిఫ్ట్ లోపలికి వెళ్లేందుకని కాలు పెట్టాడు. దీంతో మొదటి అంతస్తులో ఉన్న లిఫ్ట్ పైభాగంలో పడిపోయాడు. వేరేవారు లిఫ్ట్ ఆన్‌చేసి పై అంతస్తులోకి వెళ్లారు. పైభాగంలో ఉన్న స్లాబ్ తగలడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మూడో అంతస్తులో లిఫ్ట్ ఆగిపోవడంతో మెకానిక్ వచ్చి మరమ్మతులు చేస్తుండగా పైభాగంలో మనిషి చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రామచంద్రపురం పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.