Couple reunite in Lok Adalat : 'తప్పు నేనే చేశాను.. క్షమాపణలు కాదు కాళ్లే మొక్కుతా..' లోక్ అదాలత్‌లో ఆలుమగల కొట్లాట సుఖాంతం - National Lok Adalat Programme
🎬 Watch Now: Feature Video
Published : Sep 9, 2023, 7:36 PM IST
Couple reunite with Lok Adalat Counciling : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో హృదయాలను కదిలించే ఈ సంఘటన చోటుచేసుకుంది. గద్వాల పట్టణం సుంకులమ్మ మెట్టుకు చెందిన డ్రైవర్ గోవిందుకు.. రాజేశ్వరి అనే మహిళతో 14 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. గోవిందు తాగిన మైకంలో.. తరచూ తన భార్యతో గొడవపడి చేయి చేసుకునేవాడు. విసిగిపోయిన రాజేశ్వరి చివరకు గద్వాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వీరి సమస్య కొన్ని రోజులు తరువాత రాజీ కొరకు జాతీయ లోక్‌అదాలత్‌కు చేరింది.
Couple Meet in Lok Adalat at Jogulamba Gadwal : జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుషాతో పాటు.. జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి రోజ్ క్రిస్టియన్ , సీనియర్ సివిల్ జడ్జి గంటా కవిత, జూనియర్ సివిల్ జడ్జి ఉదయ్ నాయక్‌ల సమక్షంలో జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో కౌన్సెలింగ్ ఇచ్చి.. ఈ దంపతులను కలిపారు. అనంతరం ఇద్దరూ దండలు మార్చుకొనేలా చేశారు. గోవిందు భావోద్వేగానికి గురవుతూ.. తాగిన మైకంలో తన భార్యను కొడుతుండడం పొరపాటేనని నిజాయితీగా ఒప్పుకున్నాడు. దీనితో న్యాయమూర్తులు ఆమెకు క్షమాపణ చెప్పాలని కోరగా సారీ కాదు.. కాళ్లే మొక్కుతానని తన భార్య కాళ్లను మొక్కాడు. వాస్తవంగా చెప్పాలంటే తన తల్లిదండ్రులకు మించి తన భార్య తనను చూసుకుంటుందని ఇక ముందు అలా చేయనని గోవిందు చెప్పాడు. ఈ దృశ్యాలతో లోక్ అదాలత్ ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగిపోయింది.