కాంగ్రెస్‌కు ఎల్బీనగర్ కంచుకోట : మధుయాష్కీ - కేసీఆర్ పై మధు యాస్కీ వ్యాఖ్యలు
🎬 Watch Now: Feature Video


Published : Nov 13, 2023, 5:39 PM IST
Congrss Election Compaign In Telangana 2023 : ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. కొత్తపేట మారుతినగర్ హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకొని పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం మాట్లడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర పరిస్థితి మారలేదన్నారు. రాష్ట్రం సిద్ధించి తొమ్మిదేళ్లు అవుతున్నా యువత నిరుద్యోగంతో మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్లను కలుస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మధుయాష్కీ కోరారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల గురించి వివరించారు.
Madhu Yaski Padayatra : అర్హులందరికి ఫించన్ రావడం లేదు.. లబ్ధిదారులకు తెల్లరేషన్ కార్డులు ఇవ్వడం లేదని విమర్శించారు. ఎల్బీనగర్ కాంగ్రెస్‌కి కంచుకోటలా ఉందన్నారు. పాదయాత్రలో సర్వ కుల, మతాల ప్రజలు మంగళ హారతులు పడుతూ, బోనాలు తీస్తూ, దట్టీలు కడుతూ, ప్రార్థనలు చేస్తూ మద్దతు పలికారు. మధన్నకే మా ఓటు అని ప్రజలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి, వజీర్ ప్రకాష్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు లింగాల కిషోర్ గౌడ్, షరీఫ్, టిజేఎస్ నాయకులు పల్లె వినయ్, రంగారెడ్డి కాంగ్రెస్ మహిళ నాయకులు సుజాత రెడ్డి, రజిని, విద్యార్థి నాయకులు తదిరులు పాల్గొన్నారు.