Congress to Go Court on Dalit Bandhu and BC Bandhu Scam : 'దళిత బంధు, బీసీ బంధు అక్రమాలపై కోర్టుకు వెళతాం' - మంత్రి కేటీఆర్​పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2023, 9:59 PM IST

Komatireddy Venkat Reddy Fires on KTR : దళిత బంధు, బీసీ బంధులో జరిగిన అక్రమాలపై త్వరలోనే కాంగ్రెస్​ కోర్టుకు వెళ్లనున్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్​ దగ్గర ఉన్న తెలంగాణ ద్రోహులను తీసేస్తే.. కాంగ్రెస్​లో ఉన్న తెలంగాణ ద్రోహులను కూడా తీస్తేస్తామని సవాల్​ విసిరారు. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మంత్రి కేటీఆర్​ చేసిన చిట్​చాట్​పై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు.

కేటీఆర్​ అమిత్​షాను కలిసిన తర్వాతనే కవిత కేసు ఆగిపోయిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. కేసీఆర్​ 115 మంది అభ్యర్థులను ప్రకటించి.. ఒక్కొక్కరికీ రూ.10 కోట్లు ఇచ్చినట్లు ఆరోపించారు. మహమూద్​ అలీ, పద్మా దేవేందర్​ రెడ్డిలను కేసీఆర్​ బానిసల్లా చూస్తున్నారని మండిపడ్డారు. దళిత బంధు, బీసీ బంధులో జరిగిన అక్రమాలపై కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. తెలంగాణ కోసం కాంగ్రెస్​ పార్టీలో ఎవరైనా కొట్లాడారా అని అంటున్నారు.. మూడేళ్లు వరకు ఉన్న మంత్రి పదవి త్యాగం చేసి.. ఉద్యమం చేశానని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.