పేదల సంక్షేమం కోసమే సోనియా గాంధీ 6 గ్యారంటీ పథకాలు : విజయ రెడ్డి - vijaya reddy campaigning

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 16, 2023, 5:22 PM IST

Congress Party Election Campaign In Telangana : ఖైరతాబాద్ నియోజకవర్గంలో గత పాలకులు చేసిన అభివృద్ధి శూన్యమని, ప్రజలు గత పాలకులను నమ్మి ఓట్లు వేశారని..తీరా చూస్తే నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని..రానునే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తారని విజయ అన్నారు. తాను అత్యధిక మెజార్టీతో తప్పక గెలుస్తానని ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పి. విజయ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఫిలింనగర్ (జూబ్లీహిల్స్ డివిజన్)లో పలు బస్తీల్లో పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రజలకు వివరిస్తూ..ఆనంతరం విజయరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. పేదల సంక్షేమం కోసం సోనియా గాంధీ ఆరు పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. 

VijayaReddy Comments On BRS : అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ.. రానున్న ఎన్నికలు కాంగ్రెస్ చేతిలో ఓటమి తప్పదని విజయరెడ్డి తెలిపారు. గత పది సంవత్సరాలలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం అభివృద్ధి పథకాల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి భయపడాల్సిన పనిలేదని వారందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఓట్ల కోసం మరొకసారి ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి వారికి బుద్ధి చెప్పాలన్నారు. పేదలందరికీ కాంగ్రెస్ హాయంలోనే న్యాయం జరిగిందని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని విజయరెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బస్తీ వాసులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.