MLC Jeevan Reddy Fires on KCR : 'కాలంపై కేసీఆర్‌కు అవగాహన ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు' - సీఎం కేసీఆర్‌పై జీవన్‌రెడ్డి ఫైర్
🎬 Watch Now: Feature Video
MLC Jeevan Reddy supports Farmers Protest : రోహిణి కార్తె వేళవుతున్నా ఇంకా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదని... రైతుల ఆవేదనను కేసీఆర్ గుర్తించాలని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో తిప్పన్నపేట ఐకేపీ కేంద్రం వద్ద ధాన్యం కొనుగోళ్ల తీరును నిరసిస్తూ రైతులు ఆందోళన నిర్వహించారు. అన్నదాతల ధర్నాకు మద్దతుగా జీవన్‌రెడ్డి ఐకేపీ కేంద్రం వద్ద గంటకు పైగా రహదారిపై బైఠాయించారు. కేసీఆర్‌కు కాలాలపై అవగాహన ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని జీవన్‌రెడ్డి అన్నారు.
ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు కొనుగోళ్లలో జాప్యానికి తోడు.. తరుగు పేరుతో అన్నదాతలను నిలువునా దోపిడి చేస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఒక రైతుకు చెందిన ధాన్యం 106 క్వింటాళ్లకు 6.90 కేజీల కోత విధించారన్నారు. ఇప్పటికే రైతుబంధు పేరుతో రైతులకు కల్పించిన రాయితీలు, సౌకర్యాలు దూరం చేశారని... ఆపై కొనుగోళ్ల తీరుతో ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు. అధికారులను కొనుగోళ్ల విషయం గురించి అడిగితే.. లారీలు ఇప్పుడే పంపిస్తామంటారు కానీ పంపిచట్లేదని జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు.