Congress Leaders Protests Aganist BJP : 'రావణ్'​గా రాహుల్​గాంధీ పోస్ట్​పై కాంగ్రెస్​ నిరసనలు.. బీజేపీ కార్యాలయం​ ముట్టడికి యత్నం - టీ కాంగ్రెస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2023, 7:46 PM IST

Congress Leaders Protests Aganist BJP : బీజేపీ ట్విటర్​ హ్యండిల్​లో.. రాహుల్​గాంధీ ఫోటోను రావణుడిగా పోల్చుతూ పోస్ట్​ చేసినందుకు హైదరాబాద్​లో కాంగ్రెస్​శ్రేణులు నిరసనలు చేపట్టారు. గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

BJP Posts Rahul as Ravana in Twitter : గాంధీభవన్​కు పెద్ద సంఖ్యలో మొహరించిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట వాగ్వాదం చోటుచేసుకుంది. గాంధీభవన్‌ గేటు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు అనిల్​కుమార్ యాదవ్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు.. గాంధీభవన్‌ నుంచి భారీ ప్రదర్శనగా బయలుదేరారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు.. బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత్​ జోడోయాత్రతో రాహూల్​ గాంధీపై ప్రజలలో పెరిగిన ఆదరణను ఓర్వలేక ఇటువంటి పోస్టులు పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. దేశానికి కాబోయే ప్రధాని రాహుల్​గాంధేనని స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.