హెలికాప్టర్​ ల్యాండింగ్​ చేసే సమయంలో సాంకేతిక సమస్య - ఇల్లందులో దిగకుండానే వెళ్లిపోయిన రేవంత్ - కాంగ్రెస్​ పార్టీ ప్రచారం 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2023, 7:23 PM IST

Congress Election Campaign at Yellandu : బీఆర్​ఎస్​ ప్రభుత్వం అబద్ధాలతో రెండు పర్యాయాలు పరిపాలించిందని కాంగ్రెస్​ రాష్ట్ర ప్రచార కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఈ తొమ్మిది సంవత్సరాల పాలనలో ప్రజలు అనేక కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్యకు మద్దతుగా రోడ్​షో నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్​ కుటుంబ పాలనకు స్వస్తి చెప్పి.. ఇందిరమ్మ రాజ్యాన్ని తేవాలని పిలుపునిచ్చారు.

ఇల్లందులో బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లందు నియోజకవర్గ రోడ్​షోలో కాంగ్రెస్​ పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి పాల్గొననుండగా.. హెలికాప్టర్​ ల్యాండింగ్​ చేసే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆయన హాజరు కాలేకపోయారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.