రెండు పర్యాయాలు కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసినా - ప్రజల జీవితాలు బాగుపడలేదు : పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
🎬 Watch Now: Feature Video
Congress election campaign 2023 in Bhadrachalam : అహంకారాన్ని గద్దె దించి.. నీతి నిజాయతీలకు పట్టం కట్టాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య తరఫున మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ ఎమ్మెల్సీ బాలసానితో కలిసి ప్రచారం నిర్వహించారు. అవినీతిని.. పదవి అహంకారాన్ని ఓడించి నీతి, నిజాయతీలకు పట్టం కట్టాలని తుమ్మల కోరారు. ఇప్పుడు పరిపాలిస్తున్న అవినీతి పాలనలో ప్రజలంతా అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ధర్మానికి, అధర్మానికి.. న్యాయానికి అన్యాయానికి జరిగే పోరాటం ఇదని.. ఇందిరమ్మ రాజ్యానికి, దోపిడీ రాజ్యానికి జరుగుతున్న ఈ కురుక్షేత్రంలో ప్రజా పాలన రావాలని తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారని పొంగులేటి పేర్కొన్నారు.
Ponguleti Fires On KCR : ప్రజలంతా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. ప్రస్తుతం ఒకే కుటుంబానికి పరిమితమైందని పొంగులేటి ఆరోపించారు. నిరంకుశ పరిపాలనలో రాష్ట్రం నిర్లక్షానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు పర్యాయాలు కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసినా.. ప్రజల జీవితాలు బాగు పడలేదని విమర్శించారు. తన కుటుంబ స్వార్థం కోసం మూడోసారీ సీఎం అవుదామని కలలు కంటున్నారని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో కొందరు అధికార పార్టీలో చేరారని.. రూ.కోట్లు ఇస్తామన్నా వెళ్లకుండా ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న పొదెం వీరయ్యను మరోసారి గెలిపించాలని కోరారు.