College Bus Hits GHMC Worker Hyderabad : కాలేజ్ బస్సు ఢీకొని GHMC కార్మికురాలు మృతి.. వీడియో వైరల్ - College Bus Hits GHMC Worker Hyderabad Today
🎬 Watch Now: Feature Video
Published : Aug 28, 2023, 11:46 AM IST
College Bus Hits GHMC Worker Hyderabad Today : రోజువారి లాగే విధులకు హాజరైన పారిశుద్ధ్య కార్మికురాలిని కాలేజ్ బస్సు రూపంలో మృత్యువు కబలించింది. రోడ్డు ఊడుస్తున్న సమయంలో.. వేగంగా వచ్చిన కాలేజీ బస్సు ఢీ కొట్టడంతో జీహెచ్ఎంసీ కార్మికురాలు మరణించిన ఘటన హైదరాబాద్‌లోని రాంకోఠిలో ఇవాళ ఉదయం(GHMC Worker Killed in Accident) చోటుచేసుకుంది.
Bus Hits Municipal Worker in Hyderabad Today : అయాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాలకు చెందిన బస్సు వేగంగా వచ్చి.. అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. అదే సమయంలో అక్కడ రహదారిని ఊడుస్తున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు సునీతపైకి బస్సు దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. గమనించిన స్థానికులకు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని బస్సును సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని.. శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి శవాగారానికి తరలించారు.
జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు సునీత మృతి పట్ల.. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇవ్వాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా ఆమెకు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. జరిగిన ప్రమాద ఘటనపై కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు. సునీత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మేయర్ భరోసా కల్పించారు.