కోడి పందేలు అప్పుడే మొదలైపోయాయిగా - ఏపీలో కాదు మన తెలంగాణలోనే - Cockfights Bettings
🎬 Watch Now: Feature Video
Published : Jan 9, 2024, 1:33 PM IST
Cockfights in Komaram Bheem Asifabad on Sankranti : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పలుచోట్ల కోడి పందేలు మొదలయ్యాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఏజెన్సీ ప్రాంతాల్లో పందేలు జోరుగా జరుగుతున్నాయి. పోలీసు అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వెల్గి గ్రామ పంచాయతీ శివారులోని ఖాళీ స్థలాల్లో బరులు ఏర్పాటు చేశారు. కోళ్ల యజమానులతో పాటు పలు గ్రామాలకు చెందిన వ్యక్తులు కూడా పందేలు కాస్తున్నారు.
Cockfights in eve of Sankranti Festival : ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతుంది. అయితే కోడి పందేలు ఒకేచోట కాకుండా పలుచోట్ల కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మండలంలోని ఖేడేగాం గ్రామం అటవీ ప్రాంతం కావడంతో గట్టు వెంబడి పొలాలను అడ్డుగా చేసుకుని నిర్వాహకులు కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో సంక్రాతి పండుగ సందర్భంగా కోడి పందేలు నిర్వహించినా, వాటి కోసం బరులు సిద్ధం చేసినా, చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఓ ప్రకటనలో హెచ్చరించారు.