Coal Production Stopped in Kothagudem : ఏకధాటి వాన.. కొత్తగూడెంలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి - ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 13, 2023, 1:54 PM IST

Coal Production Affected by Rain Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో కొత్తగూడెంలోని సింగరేణి గౌతమ్ ఖని ఓపెన్ కాస్ట్​లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఎదురవుతోంది. వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్​లోకి వరదనీరు చేరడంతో బొగ్గు వెలికితీయడం సాధ్యం కావడంలేదు. వర్షంతో గని నుంచి బయటకు వచ్చే రోడ్లు అన్ని చిత్తడిగా మారడంతో వాహనాలు తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సుమారు 1000 టన్నుల బొగ్గు వెలికితీతకు ఆటంకం ఏర్పడింది. సింగరేణి అధికారులు మోటార్ల సాయంతో నీటిని బయటకు తోడే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మొదటి షిఫ్ట్ నిలిపివేయగా వర్షం తగ్గితే రెండో షిఫ్ట్ పనులు ప్రారంభిస్తామని సింగరేణి అధికారులు తెలిపారు. నిరంతరాయంగా వర్షం కురుస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.