అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి - వీడియో వైరల్ - సీఎం రేవంత్ రెడ్డి
🎬 Watch Now: Feature Video
Published : Dec 30, 2023, 7:30 PM IST
CM Revanth Reddy Gives Way to Ambulance : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్లే రహదారిలో అంబులెన్స్ వస్తే, అంబులెన్స్‌ను ఆపకుండా దారి ఇచ్చారు. ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Revanth Reddy Convoy Gives Way to Ambulance : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్తుండగా కేబీఆర్ పార్క్ వద్దకు వచ్చేసరికి అంబులెన్స్‌ను గమనించారు. తన కాన్వాయ్ కోసం అంబులెన్సును ఆపకుండా దారివ్వాలని భద్రతా సిబ్బందికి సూచించారు. దీంతో అంబులెన్స్ ఆగకుండా వెళ్లిపోయింది. ఈ సంఘటనపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఫుడ్ డెలివరీ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఎక్కువగా ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ రేవంత్ రెడ్డి మొదటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పయనిస్తున్నారు.