100 మంది కేసీఆర్‌లు వచ్చినా నన్ను ఓడించలేరు: భట్టి విక్రమార్క - భట్టి విక్రమార్క మధిర మీటింగ్
🎬 Watch Now: Feature Video
Published : Nov 25, 2023, 4:59 PM IST
CLP Leader Bhatti Vikramarka Election Campaign : రాష్ట్ర సంపదను బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని మధిరలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఫ్యూడల్ ప్రభుత్వమైన బీఆర్ఎస్ను బంగాళాఖాతంలో కలపాలని.. ప్రజల సర్కార్‌ను అధికారంలోకి తీసుకురావాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
Today Bhatti Vikramarka Election Campaign : మధిరలో జరిగిన బీఆర్ఎస్(BRS) ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ తనను ఓడిస్తానని అన్నారని.. 100 మంది కేసీఆర్‌లు వచ్చినా తనని ఓడించలేరని భట్టి విక్రమార్క బదులిచ్చారు. మధిరలో 50 వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నెలకు మహిళల ఖాతాలో రూ.2,500 వేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర సంపదను బీఆర్ఎస్ నేతలు దోచుకుంటున్నారని.. ప్రజల సంపద.. ప్రజలకే దక్కాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని సూచించారు.