CLP Bhatti Vikramarka Padayatra: భట్టి 'పీపుల్స్ మార్చ్' పాదయాత్ర @50 రోజులు - భట్టి పాదయాద్ర సంబురాలు
🎬 Watch Now: Feature Video
CLP Bhatti Vikramarka Padayatra: హాథ్‌సే హాథ్ జోడో యాత్రలో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్క.. బీబీనగర్ మండలం గొల్లగూడెం వద్ద పార్టీ నేతలతో కలిసి కేకు కోశారు. ప్రజాసమస్యలపై పోరుబాట పట్టి.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా భట్టి యాత్ర చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అన్నారు. భట్టిని శాలువాతో సత్కరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోనే నిన్నటితో భట్టి విక్రమార్క పాదయాత్ర 600 కిలోమీటర్లకు చేరుకుంది. ఇవాళ 50 రోజుల యాత్ర యాదాద్రి జిల్లాలోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో భట్టి యాత్రకు సంబంధించి ప్రతి మైలురాయి తమ జిల్లాలో పూర్తి కావటం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తూ... సీఎల్పీ నేత ముందుకు సాగుతున్నారు. యాదాద్రి జిల్లాలోని గొల్లగుడెం, ముగ్దంపల్లి, మీదుగా భట్టి విక్రమార్క యాత్ర సాయంత్రం భూదాన్‌పోచంపల్లికి చేరుకోనుంది. కార్నర్ మీటింగ్ అనంతరం.... రాత్రి పోచంపల్లిలోనే బసచేయనున్నారు