Clash Between Podu Farmers and Forest Officials : పోడు భూముల సాగు వివాదం.. అటవీ సిబ్బందితో రైతుల వాగ్వాదం - Clash between farmers forest officers mulugu
🎬 Watch Now: Feature Video


Published : Sep 11, 2023, 9:56 PM IST
Clash Between Podu Farmers and Forest Officials : ములుగు జిల్లాలో పోడు భూముల సాగు (Podu Lands Issue) విషయంపై ఘర్షణ చోటుచేసుకుంది. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో పోడు భూముల సాగుపై అటవీశాఖ అధికారులకు.. పోడు రైతులకు (Podu Farmers) మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు వదిలేదిలేదని అన్నదాతలు స్పష్టం చేశారు. అటవీ భూములను గత 35 సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమను అధికారులు వేధిస్తున్నారని వారు ఆరోపించారు.
Podu Lands Issue in Mulugu District : తద్వారా జీవనోపాధి కోల్పొతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్లో అటవీశాఖ అధికారులు.. తాము భూములు సాగు చేయకుండా అడ్డుకుంటున్నరని ఆరోపించారు. తమకు జీవనాధారమైన పొలాలను లాక్కునేందుకు యత్నించటం సరికాదని వాపోయారు. దశాబ్దాలుగా పోడు భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం పోడు రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.