Citizen Youth Parliament Closing Ceremony in OU : యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది.. దేశానికి బలమైన పిల్లర్లు మీరే: గవర్నర్ - తెలంగాణ గవర్నర్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 11, 2023, 10:45 AM IST
Citizen Youth Parliament Closing Ceremony in OU : ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన సిటిజన్ యూత్ పార్లమెంట్ ముగింపు వేడుకలకు గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. సిటిజన్ యూత్ పార్లమెంట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని గవర్నర్ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న యూనివర్సిటీ యాజమాన్యాన్ని అభినందించారు. యువత దేశ భవిష్యత్తుకు బలమైన పిల్లర్లని అన్నారు. తాను మెడికల్ కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పుడు రాజకీయాల్లో ప్రవేశించానని.. స్టూడెంట్ లీడర్‌గా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి నాయకురాలిగానే రాజకీయ నాయకురాలిగా ఎదిగానని, ఆ తర్వాత గవర్నర్‌గా అవకాశం వచ్చిందన్నారు. దేశానికి యువత ఎంతో అవసరమని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరంలో కూడా యువత, విద్యార్థులే అధికంగా ఉన్నారని గుర్తు చేశారు.
Governer Participated in Citizen Youth Parliament Closing Ceremony : తాను విద్యా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తానని గవర్నర్ చెప్పారు. యువత నిబద్ధతతో చదువుకుంటే.. రాణించగలరని అన్నారు. స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ఆయన పుస్తకాలు చదవాలని విద్యార్థులకు సూచించారు. చదువును నిర్లక్ష్యం చేయకూడదని, అన్ని రంగాల్లో ముందుడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, ఓయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్, రిజిస్టార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.