Manchu Manoj Birthday Celebrations at Orphanage : అనాధాశ్రమంలో మంచు మనోజ్ బర్త్డే వేడుకలు - రంగారెడ్డి జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video
Manchu Manoj Birthday Celebrations at Orphanage in quthbullapur : సినీనటుడు మంచు మనోజ్ తన జన్మదిన వేడుకలను కుత్బుల్లాపూర్ పరిధి గాజుల రామారంలోని కేర్ అండ్ లవ్ అనాథ శరణాలయంలో జరుపుకున్నారు. అక్కడి పిల్లలతో సరదాగా గడిపారు. అనంతరం వారికి నోట్ పుస్తకాలు, బహుమతులు అందజేశారు. తన పుట్టిన రోజును పిల్లలతో కలిసి జరుపుకున్నందుకు ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడున్న ప్రతి చిన్నారి.. జీవితంలో ఎంతో విషాదం దాగుందన్నారు. ఈ వయసులో పిల్లల కష్టాలు బాధ పడే అంశం అయితే.. వాళ్లలో ఉన్న పట్టుదల చూస్తే ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే పేదవారికి సహాయం చేయడానికి కొన్ని సంవత్సరాల క్రితం యూనిటీ పేరుతో ఛారిటీని ప్రారంభించానని మనోజ్ తెలిపారు. రాబోయే రోజుల్లో పిల్లలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేస్తానన్నారు. తన జన్మదినం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మంచు మనోజ్ ధన్యవాదాలు తెలిపారు.