విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై లాఠీ ఝుళిపించిన సీఐ - వీడియో వైరల్ - కానిస్టేబుల్ని కొట్టిన సీఐ వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-12-2023/640-480-20158064-thumbnail-16x9-ci-constable.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Dec 1, 2023, 6:22 PM IST
CI Beat Constable at Polling Center in Maheshwaram : విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై ఇన్‌స్పెక్టర్ లాఠీ ఝుళిపించారు. రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాదర్‌గుల్‌లో పోలింగ్ కేంద్రం వద్ద గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందె శ్రీరాములు నాదర్‌గుల్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లారు. అభ్యర్థి వ్యక్తిగత భద్రతా సిబ్బంది అయిన ఏఆర్ కానిస్టేబుల్ యాదగిరి పోలింగ్ కేంద్రం వెలుపలు ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో పెట్రోలింగ్ వాహనంలో ఆదిభట్ల ఇన్‌స్పెక్టర్ రఘవీర్‌రెడ్డి అక్కడికి వచ్చారు.
CI Beat Constable Viral Video in Rangareddy : ఇన్‌స్పెక్టర్‌ను చూసిన కానిస్టేబుల్ సెల్యూట్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే ఆ సీఐ కానిస్టేబుల్‌ను లాఠీతో కొట్టి దూరంగా నెట్టేశారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్ని తన మొబైల్లో చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సఫారీ దుస్తుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై లాఠీ ఝుళిపించడం చర్చనీయాంశంగా మారింది.