కిరాణ దుకాణంలోకి చొరబడి యువకుడి కిడ్నాప్.. అంతా చూస్తుండగానే.. - తమిళనాడు సేలం జిల్లా
🎬 Watch Now: Feature Video
ఓ కిరాణ దుకాణంలోనుంచి యజమాని కుమారుడిని కిడ్నాప్ చేసిన సంఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో గురువారం ఉదయం జరిగింది. ఉదయం 7గంటల ప్రాంతంలో ఆరుగురు దుండగలు షాప్‌లోకి చొరబడి అపహరించారు. రాజస్థాన్‌కు చెందిన ముల్లారామ్ అనే వ్యక్తి చిన్నకడాయ్ గ్రామంలో కిరాణ దుకాణం నడుపుతున్నారు. గురువారం ఉదయం దుకాణంలోని ఆయన కుమారుడు జయరామ్ వెళ్లాడు. 7గంటల ప్రాంతంలో ఆరుగురు దుండగులు షాప్‌లోకి వచ్చి జయరామ్‌తో గొడవకు దిగారు. ఆ తర్వాత దుకాణంలోంచి లాక్కెళ్లి మినీ ట్రక్కులో ఎక్కించుకుని వెళ్లారు. ముల్లారామ్ ఫిర్యాదు మేరకు సేలం టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST