Chicken Biryani for One Rupee Note : రూపాయి బిర్యానీ కోసం వెళ్తే.. రూ.100 ఫైన్ పడింది - one rupee biryani godava in karimnagar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-06-2023/640-480-18774832-238-18774832-1686974319101.jpg)
One Rupee Biryani in Karimnagar : కరీంనగర్‌లోని ఓ హోటల్.. ప్రారంభోత్సవ ఆఫర్‌గా ఒక రూపాయికే బిర్యానీ అని ప్రకటించింది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. ఒక రూపాయి అంటే రూపాయి కాయిన్ కాదు.. రూపాయి నోటు. రూపాయి నోటు ఉంటే.. బిర్యానీ ఇచ్చేస్తున్నారు. ఈ ఆఫర్ గురించి తెలిసి ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. ఆ హోటల్ ప్రాంతంలో వందలాది వాహనాలు పార్క్ చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఒక రూపాయి నోటు ఇచ్చిన వారికి బిర్యానీ అంటూ నగరంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ నోట్లను సేకరించి మరీ హోటల్ వద్దకు ప్రజలు క్యూ కట్టారు. ఆఫర్ మద్యాహ్నం 2.30 గంటల తరువాత అని హోటల్ యాజమాన్యం ప్రకటించినప్పటికీ అంతకు ముందు నుంచే బిర్యానీ కోసం బారులు తీరారు.
క్యూ కట్టిన జనం సహనం కోల్పోయిన హోటల్‌లోకి చొరబడ్డారు. దీంతో అక్కడ ఉద్ధృత వాతావరణ తలెత్తింది. దీనిని గమనించిన పోలీసులు రంగంలోకి దిగి అక్కడికి వచ్చిన జనాన్ని చెదరగొట్టి..హోటల్‌ను తాత్కాలికంగా మూయించారు. హోటల్ ప్రారంభోత్సవం రోజే అందరికి తెలియాలన్న కోరిక నెరవేరినప్పటికి.. ప్రారంభించిన కొంత సమయానికి మూసివేయాల్సి వచ్చిందని యజమాని తెలిపారు. బిర్యానీ కోసం వచ్చిన ప్రజలు తిరిగి వెళ్లిపోయారు. అయితే అక్కడ నో పార్కింగ్‌లో పార్కింగ్ చేసిన వాహనాలకు పోలీసులు రూ.100 జరిమానా విధించారు. రూపాయి బిర్యానీ కోసం వెళ్తే వంద రూపాయల ఫైన్ కట్టాల్సి రావడం కొసమెరుపు.