Cheddi Gang Halchal in Miyapur : నగరంలో మళ్లీ చెడ్డీగ్యాంగ్ కలకలం.. మియాపూర్లో భారీ చోరీ - Telangana latest news
🎬 Watch Now: Feature Video
Cheddigang Halchal in Miyapur : హైదరాబాద్‌లో చెడ్డీగ్యాంగ్ ఆగడాలు మళ్లీ మొదలయ్యాయి. గత కొంతకాలంగా కనిపించకుండా పోయిన ఈ ముఠాలు.. ఇటీవల మళ్లీ చొరబడుతుండటం నగరంలో కలకలం రేపుతోంది. ఇటీవల మియాపూర్ ప్రాంతంలో అర్ధరాత్రి చెడ్డీగ్యాంగ్ హల్‌చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం మియాపూర్లోని వసంత్ వ్యాలీలో.. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి చెడ్డీ గ్యాంగ్ చొరబడింది. ఎవరూ లేని సమయంలో.. ప్రహరీ గోడ దూకి దొంగల ముఠా లోపలికి వెళ్లింది.
Cheddi Gang Thefts in Hyderabad : తాళం వేసి ఉండటంతో బాత్‌రూం వెంటిలేటర్ అద్దాలు పగులగొట్టి.. ఐదుగురు దొంగలు లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు అపహరించి వెళ్లిపోయారు. తిరిగి వచ్చిన యజమాని దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. 30 తులాల వరకు బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా చెడ్డీగ్యాంగ్ ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.