Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు.. - ఏసిబి ఆన్ చంద్రబాబు బెయిల్
🎬 Watch Now: Feature Video
Published : Sep 26, 2023, 4:14 PM IST
Chandrababu Bail Petition: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ మంజూరుచేయాలని కోరుతూ... చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ (Bail Petition), చంద్రబాబును కస్టడీకీ కోరుతూ సీఐడి దాఖలు చేసిన కస్టడి పిటిషన్‌లు(CID Custody Petitions) ఏసిబి కోర్టు ఇంఛార్జి న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. ఈరోజు ఏసిబి కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉంది. ఏసిబి కోర్టు న్యాయమూర్తి ఈరోజు సెలవు పెట్టారు. దీంతో ఈ పిటషన్లు విచారించాలని కోరుతూ న్యాయవాదులు ఏసిబి ఇంఛార్జి కోర్టు ముందు ప్రస్తావించారు. కస్టడి పిటిషన్‌పై చంద్రబాబు తరుపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను రేపటికి వాయిదా వేస్తున్నామని ఇంఛార్జి కోర్టు న్యాయమూర్తి తెలిపారు. అయితే ఈరోజు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాలని చంద్రబాబు తరుపు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరారు. ఈరోజే పిటిషన్‌పై విచారణ జరిపి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యపడదని రేపటి నుంచి తాను సెలవుపై వెళుతున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. రేపు రెగ్యులర్ కోర్టులో వాదనలు వినిపించాలన్న న్యాయమూర్తి పేర్కొన్నారు.