Chain Snatching in Bodhan : అలా వచ్చి.. ఇలా దోచుకున్నారు.. తేరుకునేలోపే పరారయ్యారు - NIZAMABAD LATEST CRIME
🎬 Watch Now: Feature Video
Published : Aug 25, 2023, 7:44 PM IST
Chain Snatching in Bodhan : గుడికి వెళ్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి మెడలోని 2 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. బోధన్ నర్సీ రోడ్డులోని మర్రి మైసమ్మ ఆలయ సేవకురాలు లక్ష్మి.. రోజూలాగే ఆలయానికి వెళ్తుండగా.. ఎవరూ లేని సమయం చూసి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. ఆమెను కొట్టి మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసును కాజేశారు. వెంటనే బండిపై పారిపోయారు. వారు వేగంగా వెళ్లిపోవడం, చుట్టూ ఎవరూ లేకపోవడంతో బాధితురాలు నిస్సహాయురాలైంది. దోపిడీకి పాల్పడి పరారవుతున్న ముగ్గురు చైన్ స్నాచర్ల ఆనవాళ్లు సాలూర క్యాంప్ వద్దనున్న సీసీటీవీ పుటేజ్‌లో రికార్డయ్యాయి. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు. చైన్ స్నాచర్ల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టపగలే నడిరోడ్డుపై జరిగిన ఈ ఘాతుకంతో స్థానిక ప్రజలంతా భయాందోళ చెందుతున్నారు.