పెద్దపల్లిలో రూ. 31లక్షల నగదు పట్టివేత- ఇద్దరిపై కేసు నమోదు - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 3:49 PM IST

Cash Seize in Peddapalli : రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక నేతల తలరాత ఓటర్ల చేతిలోనే ముడిపడి ఉంది. రేపే పోలింగ్ కావడంతో నాయకులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో.. కట్టల కొద్దీ డబ్బు బయటపడుతోంది. తాజాగా పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో.. ఎన్నికల అధికారులు రూ. 31 లక్షల నగదును జప్తు చేశారు. 

Telangana Assembly Elections 2023 : పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.. చింతకుంట విజయరమణారావు బంధువుల ఇంట్లో మంగళవారం రాత్రి ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని విజయ రమణారావుకు సంబంధించిన కుటుంబ సభ్యులు.. ఆనందరావు ఇంటిపై దాడులు నిర్వహించి రూ. 31 లక్షల నగదును పట్టుకున్నారు. ఈ డబ్బు ఓటర్లకు పంచడానికి దాచారని నిర్ధారణ అవ్వడంతో.. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అనంతరం నగదును పెద్దపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.